హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘దేవగుడి’ టీజర్ విడుదల

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘దేవగుడి’ టీజర్ విడుదల

Published on Nov 14, 2025 8:00 AM IST

srik

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై, బెల్లం సుధా రెడ్డి సమర్పణలో రూపొందిన చిత్రం ‘దేవగుడి’. ఈ చిత్రానికి బెల్లం రామకృష్ణా రెడ్డి రచన, దర్శకత్వం వహించడమే కాక, నిర్మాతగానూ వ్యవహరించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘దేవగుడి’ కథ తనకు తెలుసని, ఇది ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఒక రియల్ స్టోరి అని తెలిపారు. టైటిల్, టీజర్ అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యంగా చిత్రమ్మగారు పాడిన మెలోడీ పాట చాలా రోజుల తర్వాత తన మనసును తాకిందని కొనియాడారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు.

దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ, డిసెంబర్ 19న ‘దేవగుడి’ ఫైర్ ఉంటుందని, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కంటెంట్‌నే నమ్ముకుని ఈ సినిమా చేశామని, స్క్రీన్‌ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. ఇప్పటికే నిపుణులు, సెన్సార్ సభ్యులు సినిమాను చూసి మెచ్చుకున్నారని తెలిపారు. ఇందులో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మీకాంత్ కనికే డీఓపీగా, షేక్ మదీన్, రఘు కుంచె సంగీత దర్శకులుగా పనిచేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు