మట్టిలో మాణిక్యాన్ని ఒడిసిపట్టిన డీఎస్పీ.!

Published on Jul 17, 2021 8:03 am IST

మన టాలీవుడ్ స్టార్ సంగీత దర్శకుల్లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒకరు. సంగీత ప్రపంచాన్ని తన అద్భుత పాటలతో రంజింపజేస్తూ వస్తున్న దేవీ కొత్త కొత్త టాలెంట్ లను వెలుగులోకి తీసుకురావడంలో కూడా ముందు ఉంటారు. అయితే గత కొన్ని రోజులు కితమే తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన దృష్టికి వచ్చిన యువ గాయని వీడియో చూసి దేవీ ట్యాగ్ చేసి సాయం అడగ్గా..

అందుకు దేవీ తప్పకుండా ఆమె కోసం కనుక్కుంటానని మాట ఇచ్చి ఇప్పుడు దానిని నిజం చేసి చూపించాడు.ఆమె పూర్తి వివరాలు సేకరించి తన తమిళ సింగింగ్ షో ద్వారా వెలుగులోకి తీసుకొచ్చామని తెలిపాడు. తన పేరు శ్రావణి అని మెదక్ జిల్లాకి చెందిన ఆమె అద్భుతంగా పాడింది అని కొనియాడాడు. మరి ఈ సందర్భాన్ని కేటీఆర్ కి గుర్తు చేస్తూ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాని తెలుపగా కేటీఆర్ కూడా ఆనందం వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం :