కేటీఆర్ పరిచయం చేసిన టాలెంట్ కి దేవిశ్రీ ప్రసాద్ రిప్లై..!

Published on Jun 24, 2021 1:03 pm IST

టాలీవుడ్ రాక్ స్టార్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే ఆల్బమ్స్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా ఇప్పటికే ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవిశ్రీ ఎవరికీ తెలియని టాలెంట్ ను కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందుంటారు. మరి అలాగే ఇప్పుడు ఓ ఆసక్తికర ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో చోటు చేసుకుంది.

తెలంగాణ కి చెందిన ఓ మట్టిలో మాణిక్యం ను పరిచయం చేస్తూ దేవిశ్రీ మరియు థమన్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్యాగ్ చెయ్యగా దేవిశ్రీ ప్రసాద్ స్పందించాడు. ఆ చిన్నారి గాయని ప్రతిభను ప్రశంసిస్తూ ఇలాంటి టాలెంట్ ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపి ఆల్రెడీ తాను ఇలాంటి టాలెంట్ వేటలో ఉన్నానని ఖచ్చితంగా ఆమె వివరాలు కనుక్కుంటానని దేవి హామీ ఇచ్చాడు.

అలాగే తన కొత్త షో ద్వారా ఆమెకు అవకాశం కూడా కల్పించే ప్రయత్నం చేస్తామని తెలిపాడు. మరి ప్రస్తుతం దేవిశ్రీ అల్లు అర్జున్ తో “పుష్ప”, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ కాంబోలో చిత్రానికి సహా మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ కి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :