
యువతలో ఉత్తేజాన్ని రేకెత్తించేలా మ్యూజిక్ చేయడంలోనూ, స్టేజ్ పై చేరి ఆడియన్స్ ని డాన్సులు చేయించడంలో దేవీశ్రీ ప్రసాద్ కి మంచి పేరుంది. దేవీశ్రీ ప్రసాద్ సౌత్ లోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం దేవీశ్రీ ప్రసాద్ తమిళంలో స్టార్ హీరో ఇలయదలపథి విజయ్ నటిస్తున్న ‘పులి’ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం దేవీశ్రీ తమిళ లెజండ్రీ లిరిసిస్ట్ అయిన వైరముత్తుతో కలిసి పనిచేస్తున్నాడు. దేవీశ్రీ తన 15 ఏళ్ళ కెరీర్లో ఆయనతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. అంతే కాకుండా ఈ పులి ఆల్బంలో అన్ని సాంగ్స్ వైరముత్తు రాస్తుండడం విశేషం.
ఈ సందర్భంగా దేవీశ్రీ నిన్న వైరముత్తు గారిని కలిసి సన్మానించడమే కాకుండా ఆయనతో పనిచేయడం పట్ల తను పొందిన ఆనందాన్ని పంచుకున్నాడు. వైరముత్తు ఇప్పటి వరకూ 6 నేషనల్ అవార్డ్స్ అందుకున్నాడు. అలాగే ఈయనకి భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ను కూడా అందించింది. తమిళంలో ఎంతో ఫేమస్ ఉన్న ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సాహిత్యం అందించాడు.