ఉప్పెనతో ఆ విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వనున్న దేవిశ్రీ

Published on Jan 31, 2020 3:00 am IST

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సుదీర్ఘ కాలంగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. స్టార్ హీరోల బెస్ట్ ఛాయిస్ గా ఉన్న దేవిశ్రీ మహేష్ చిత్రాలైన మహర్షి, సరిలేరు నీకెవ్వరు కి ఇచ్చిన మ్యూజిక్ మిశ్రమ స్పందన అందుకుంది. ముఖ్యంగా మహేష్ అభిమానులు ఒకింత ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రారంభానికి ముందే వారు దేవీశ్రీ కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా మహేష్ అండ్ టీమ్ కి విజ్ఞప్తులు పంపారు. ఐతే మహేష్ దేవిశ్రీ పై నమ్మకం ఉంచి ఆయననే తీసుకున్నారు. మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు చిత్రానికి దేవీశ్రీ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు.

ఐతే సరిలేరు నీకెవ్వరు చిత్రం విషయంలో వచ్చిన విమర్శలకు దేవిశ్రీ ఉప్పెన చిత్రంతో చెక్ పెట్టాలని చూస్తున్నారట. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన చిత్రం ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ఓ రేంజ్ ఆల్బమ్ ఇచ్చి టాలీవుడ్ నంబర్ వన్ నేనే అని నిరూపించుకోవాలని చూస్తున్నాడట. ప్రేమ కథా చిత్రాలకు చక్కని బాణీలు ఇచ్చే దేవిశ్రీ ఉప్పెన చిత్రానికి బెస్ట్ ఆల్బమ్ ఇస్తారు అనడంలో సందేహం లేదు. ఉప్పెన చిత్రాన్ని బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :