యూఎస్ లో కొనసాగుతున్న “ధమాకా” ర్యాంపేజ్.!

యూఎస్ లో కొనసాగుతున్న “ధమాకా” ర్యాంపేజ్.!

Published on Dec 28, 2022 2:00 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ హిట్ చిత్రం “ధమాకా” కోసం తెలిసిందే. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించింది. మరి మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం అయితే ఒక్క తెలుగు స్టేట్స్ లో మాత్రమే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లతో సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది.

మరి మొన్నటికి అయితే ఈ చిత్రం 2 లక్షల 50 వేల డాలర్స్ నమోదు చేయగా ఇక నిన్నటితో అయితే 3 లక్షల 33 వేల డాలర్స్ మార్క్ కి ఈ చిత్రం చేరుకుంది. దీనితో మాత్రం యూఎస్ లో ధమాకా మాస్ ర్యాంపేజ్ కంటిన్యూ చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రావు రమేష్ అలాగే హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. అలాగే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు