ధన్ రాజ్ హీరోగా ‘ఐస్ క్రీమ్ 1 1/2’

ధన్ రాజ్ హీరోగా ‘ఐస్ క్రీమ్ 1 1/2’

Published on Aug 24, 2014 5:30 PM IST

Dhanraj

విలక్షణ మరియు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘ఐస్ క్రీమ్’ సినిమాకి వరుసగా సీక్వెల్స్ చేసే పనిలో ఉన్నాడు. కానీ ఈ క్రీజీ టైటిల్ ని వాడుకొంటూ మరికొన్ని సినిమాలు తెరపైకి వస్తున్నాయి. జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కమెడియన్ ధన రాజ్ తీస్తున్న షార్ట్ ఫిల్మ్ కి ‘ఐస్ క్రీమ్ 1 1/2’ అనే టైటిల్ ని పెట్టాడు. ఐస్ క్రీమ్ 2 రిలీజ్ అయిన తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కానుంది.

ఐస్ క్రీమ్ సినిమా నిర్మించే తుమ్మలపల్లి సత్యనారాయణ ఈ షార్ట్ ఫిల్మ్ ని కూడా నిర్మించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ లాంటివి ఫ్యూచర్ లో మరిన్ని రావాలని రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు నచ్చని వారి కోసం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా ఇవి తీసామని వర్మ అన్నాడు.

తాజా వార్తలు