ధనుష్ యూఎస్ నుండి రాగానే మొదలుపెట్టబోయే సినిమా ఇదే

Published on Jun 23, 2021 9:02 pm IST

డైరెక్టర్ సెల్వ రాఘవన్ ధనుష్ హీరోగా కొన్ని నెలల క్రితం కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మీద తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కరోనా లేకుండా ఉంటే ఈపాటికే సినిమా షూటింగ్ మొదలుకావాల్సింది. కానీ లాక్ డౌన్ మూలంగా రెండు నెలలు ఆలస్యం అయింది. ఇప్పుడు తమిళనాడులో కూడ లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో సినిమా షూటింగ్స్ స్టార్ అవుతున్నాయి. దీంతో సెల్వ రాఘవన్ తమ సినిమాను కూడ సెట్స్ మీదకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.

ఆగష్టు 20 నుండి చిత్రీకరణ మొదలుకానుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ధనుష్, సెల్వ రాఘవన్ కలిసి ఐదు సినిమాలు చేశారు. ఈ ఐదు సినిమాలు కూడ ప్రేక్షకుల్ని మెప్పించాయి. దాదాపు దశాబ్దం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఆరవ ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం ధనుష్ తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘గ్రే మ్యాన్’ షూటింగ్ ముగించుకుని అమెరికాలో ఉన్నారు. ఆయన అమెరికా నుండి వస్తూనే మొదలుపెట్టబోయే సినిమా ఇదే. ఈ చిత్రం కాకుండా ధనుష్ ఇంకో ఐదు సినిమాలకు సైన్ చేసి ఉన్నారు. వాటిలో శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కూడ ఉంది.

సంబంధిత సమాచారం :