
జాతీయ అవార్డు గ్రహిత ధనుష్ కు తమిళ, హిందీ ప్రేక్షకులనుండి మంచి ఫ్యాన్ బేస్ లభించింది. అతని సినిమాలు కొన్ని తెలుగులో విడుదలైనా ఇక్కడ ధనుష్ కి ఆశించినంత పేరు రాలేదు. అయితే ఈ లోటుని ‘రఘువరన్ BTech’ సినిమా తీర్చేసింది. ఈ సినిమా తెలుగులో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
దీంతో ధనుష్ పాట చిత్రాలు ఒకటి రెండు తెలుగులోకి అనువాదమయ్యే క్రమంలో కూడా వున్నాయి. ఇదిలా వుంటే కె.వి ఆనంద్ దర్శకత్వంలో రానున్న తదుపరి సినిమా ‘అనేగన్’ పై అప్పుడే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వచ్చే నెల 13న తమిళంలో విడుదలకానున్న ఈ సినిమా అనువాద హక్కులపై ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ లు ఆసక్తి చూపిస్తున్నారు. ‘వీడొక్కడే’, ‘రంగం’ వంటి విజయాలతో సుపరిచితుడైన కె.వి ఆనంద్ వలన ఈ సినిమా తెలుగు వెర్షన్ పై అంచనాలు ఏర్పడ్డాయి
అయితే ఆంద్ర తెలంగాణాలలో ఈ సినిమా తమిళ వెర్షన్ తో పాటూ విడుదలవుతుందా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది

