ధనుష్ క్రేజీ కాంబో నుంచి ఈరోజే అనౌన్సమెంట్.!

Published on Jun 18, 2021 7:01 am IST

తమిళ స్టార్ హీరోలలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెర్సిటైల్ హీరోలలో ధనుష్ కూడా ఒకడు. ఎలాంటి పాత్రలో అయినా కూడా ఇట్టే ఒదిగిపోయే ఈ స్టార్ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “జగమే తందిరం” చిత్రం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ తో సోషల్ మీడియా అంతా ఓ రేంజ్ లో హంగామా నడుస్తున్న తరుణంలోనే ఊహించని విధంగా మన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఒకరైన శేఖర్ కమ్ముల తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉందని టాక్ బయటకి వచ్చింది.

పాన్ ఇండియన్ లెవెల్లో ఈ చిత్రం ఉంటుంది అని బజ్ రాగా ఆ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ కూడా ఈరోజే ఉండనున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.. మరి ఏ సమయంలో ఈ ఊహించని అనౌన్సమెంట్ వస్తుందో చూడాలి.. దీనితో ఇది కనుక వస్తే ధనుష్ అభిమానులకి జగమే తందిరం తో కలిపి ఈరోజు డబుల్ ట్రీటే అని చెప్పాలి..

సంబంధిత సమాచారం :