తలపతితో తలపడనున్న ధనుష్ !

dhanush3

ఇళయదళపతి విజయ్ నటిస్తున్న 62వ చిత్రం ‘సర్కార్’ షూటింగ్ ఇటీవలే పూర్తిఅయింది. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం దీపావళి కానుకగా విడుదల కానుందని తెలిసిందే. ఇక ఈ చిత్రంతోపాటు సూర్య నటిస్తున్న ‘ఎన్జికె’ చిత్రం కూడా విడుదల కావాల్సివుంది. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల సూర్య వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సూర్య స్థానంలో విజయ్ తో ధనుష్ పోటీపడనున్నాడు.

ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఎన్నయి నొక్కి పాయుమ్ తోట’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని దీపావళికి విడుదల కానుంది. గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శశి కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తుంది.

Exit mobile version