హీరో ధనుష్-ఐశ్వర్య మళ్లీ కలుస్తారు – ధనుష్ తండ్రి

Published on Jan 20, 2022 2:04 am IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వీరిద్దరు వెల్లడించారు. అయితే తాజాగా వీరి విడాకులపై హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ధనుష్, ఐశ్వర్యల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు.

అయితే ప్రస్తుతం వారు ఇద్దరు చెన్నైలో లేరని, ఈ విషయమై నేను వారితో ఫోన్‌లో మాట్లాడానని, నాతో పాటు ఐశ్వర్య తండ్రి రజినీకాంత్ కూడా విడాకుల విషయమై మరోసారి ఆలోచించాలని చెప్పారని, త్వరలోనే వారిద్దరు మళ్లీ కలుస్తారని చెప్పుకొచ్చాడు. అయితే ధనుష్ తండ్రి ఈ మాట చెప్పడంతో ధనుష్,ఐశ్వర్యలు మళ్లీ కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :