మారి 2 తరువాత తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం ‘అసురన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి 45 సంవత్సరాలు కలిగిన తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ మంజు వారియర్, ధనుష్ కు జోడీగా నటిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని వి క్రీయేషన్స్ పతాకం ఫై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను తొందరగా పూర్తి చేసి ధనుష్ , కోడి ఫేమ్ దొరై సెంథిల్ కుమార్ తో తన తదుపరి సినిమా ను మొదలుపెట్టనున్నాడు.


