అతని ధైర్యమే అతని ఆయుధం…ధనుష్ “మారన్” ఫస్ట్ లుక్ విడుదల!

Published on Jul 28, 2021 6:06 pm IST

కార్తీక్ నరేన్ దర్శకత్వం లో ధనుష్ హీరోగా సరికొత్త చిత్రం ప్రారంభం అయింది. అయితే ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించడం జరిగింది. మారన్ అంటూ ధనుష్ 43 వ చిత్రం టైటిల్ ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ధనుష్ ఫస్ట్ లుక్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అతని ధైర్యమే అతని ఆయుధం అంటూ చిత్ర దర్శకుడు కార్తీక్ నరేన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ ధనుష్ కి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.త్యాగరాజన్ సమర్పణ లో సత్య జ్యోతి పతాకం పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :