“అవెంజర్స్” దర్శకుల వరకు ధనుష్ మాస్ క్రేజ్.!

Published on Jun 18, 2021 8:01 am IST

మన దక్షిణాదిన టాలెంటెడ్ హీరో ధనుష్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే.. కానీ అంతకు మించిన స్థాయిలో తన నటనతో ఇపుడు ఏకంగా గ్లోబల్ స్థాయి గుర్తింపును ధనుష్ తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ధనుష్ మాస్ క్రేజ్ మరో స్థాయికి వెళ్ళింది అని సోషల్ మీడియా రచ్చ లేస్తుంది.

వరల్డ్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అయినటువంటి “అవెంజర్స్ ఎండ్ గేమ్” దర్శకులు రస్సో బ్రదర్స్ వరకు వెళ్లడంతో ధనుష్ పేరు సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాలను షేక్ చేస్తుంది. అయితే వారితో ధనుష్ ఒక ఆంగ్లో ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే..

మరి ఈ క్రమంలోనే వీరు ధనుష్ లేటెస్ట్ చిత్రం “జగమే తందిరం” కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పడం రచ్చ లేపుతుండగా పలువురికి ధనుష్ మాస్ క్రేజ్ చూసి మైండ్ బ్లాక్ అవుతుంది.దీనితో ధనుష్ కూడా వారికి థాంక్స్ చెప్పాడు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా కూడా తియ్యకుండా ఇలాంటి క్రేజ్ ను దక్కించుకోవడం ధనుష్ కే చెల్లింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :