మాస్ కు పరాకాష్ట అనిపించేలా ఉన్నాడుగా !

Published on Apr 30, 2019 2:00 am IST

వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ‘అసురన్’. పక్కా మాస్ అంశాలతో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ధనుష్ పాత్ర మరి వైల్డ్ గా.. అనగా తమిళ్ స్టయిల్ లో ఊర మాస్ కు పరాకాష్ట అనిపించేలా ఉంటుందట. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది.

ఈ షెడ్యూల్ లో జరిగిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఆ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది చిత్రబృందం. ఆ ఫొటోలో ధనుష్ గడ్డం పెంచి చేతిలో కత్తిపట్టుకొని ఉన్నాడు.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా మంజు వారియర్ నటిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వి క్రీయేషన్స్ పతాకం ఫై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :