ధనుష్ ‘ఓం’ బుకింగ్స్ లో సాలిడ్ రెస్పాన్స్!

ధనుష్ ‘ఓం’ బుకింగ్స్ లో సాలిడ్ రెస్పాన్స్!

Published on Nov 19, 2026 10:28 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా సాయి పల్లవి, శ్రీలీల అలాగే మమ్మూటీతో లాంటి స్టార్ నటీనటుల కలయికలో దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే ‘ఓం’ చాప్టర్ 1. డీసెంట్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం రేపు గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదలకి ముందు సాలిడ్ బుకింగ్స్ ఈ సినిమా సొంతం చేసుకుంది.

ఆల్రెడీ 2 లక్షలకి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. అది కూడా కేవలం ఒక్క బుక్ మై షో నుంచే కావడం విశేషం. సో ధనుష్ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకోవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా పలు నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించగా సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. అలాగే ధనుష్ నిర్మాణం వహించిన ఈ సినిమాని తెలుగులో నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు