ధనుష్ మరో ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియన్ స్థాయిలోనే.?

Published on Jul 4, 2021 5:21 pm IST

కోలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి చాలా ఈజ్డ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో స్టార్ హీరో ధనుష్ కూడా ఒకరు. అయితే ఇటీవల వచ్చిన “జగమే తందిరం” తో గట్టి ప్లాప్ నే అందుకున్న ధనుష్ దాని తర్వాత మంచి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా ఒక్క తెలుగు, తమిళ్ మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమా కూడా ధనుష్ చేస్తున్నాడు.

అయితే శేఖర్ కమ్ములతో మంచి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన ధనుష్ ఇటీవల వారి టీం ని కూడా కలిసాడు. అలాగే ధనుష్ నుంచి నేరుగా తెలుగు డైరెక్ట్ ప్రాజెక్ట్ ఇది కావడంతో మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన కొద్ది లోనే మరో డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ పై బజ్ వినిపించింది.

టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా ఉందని తెలిసింది. అయితే ఈ చిత్రం కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే ఉండొచ్చని తెలుస్తుంది. శేఖర్ కమ్ముల సినిమా ఫార్మాట్ లో మూడు భాషల్లో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :