పాపులర్ తెలుగు దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్న ధనుష్ ?

Published on Jun 18, 2021 12:02 am IST

తమిళ హీరోలు తెలుగు దర్శకుల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారనే టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయమై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మరొక స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడితో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం.

ఆ దర్శకుడు మరెవరో కాదు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ములకు సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరుంది. ఆయన గత చిత్రం ‘ఫిదా’ భారీ విజయాన్ని అందుకుంది. ఈయనతో ట్రైలింగ్వల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట ధనుష్. త్వరలోనే వీరి కలయిక మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్న ధనుష్ ఈసారి భిన్నంగా ట్రై చేయాలని, తెలుగు స్ట్రయిట్ సినిమా చేయాలని శేఖర్ కమ్ములను చూజ్ చేసుకుని ఉండవచ్చు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ చేస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదలకానుంది. అలాగే ధనుష్ కొత్త చిత్రం ‘జగమే తంతిరం’ కూడ రేపు నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :