డిసెంబర్‌లో సెట్స్‌పైకి ధనుష్-శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్..!

Published on Jul 15, 2021 3:06 am IST


కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ వరుసగా తెలుగు సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ఇప్పటివరకు డైరెక్ట్‌గా తెలుగు సినిమాని కానీ, తెలుగు దర్శకులతో కానీ సినిమా చేయలేదు. అయితే ఇటీవల తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ఆరంభించాలాని చిత్ర యూనిట్ భావిస్తుందట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో శేఖర్‌ కమ్ముల బిజీగా ఉన్నట్తు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను నారాయణదాస్‌ నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌ రావు నిర్మించనున్నారు. కాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ధనుష్ ఓ డైరెక్ట్ తెలుగు సినిమాను చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

సంబంధిత సమాచారం :