కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ హీస్ట్ థ్రిల్లర్ మూవీ ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ‘కర’ మరి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె.గణేష్, థింక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రంలో సూరజ్ వెంజరామూడు, కేఎస్ రవికుమార్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి


