పవన్, మహేష్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోనున్న ధనుష్

Published on Jun 24, 2021 8:09 pm IST

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తమిళ హీరో ధనుష్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ తెలుగులో నటిస్తున్న ఫస్ట్ స్ట్రయిట్ మూవీ కావడం విశేషం. ధనుష్ తమిళ సినిమాలకు తెలుగునాట కూడ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన తెలుగులో సినిమా చేసున్నారు అనేసరికి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ఏషియన్ గ్రూప్ భారీ లెవల్లో నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఉండబోతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. ధనుష్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కూడ ఇదే కావడం విశేషం.

అందుకే నిర్మాతలు ఈ చిత్రానికి గాను సుమారు ధనుష్ కు రూ.50 కోట్ల పారితోషకం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ధనుష్ తన కెరీర్లో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ పుచ్చుకున్నది లేదు. తమిళంలో మంచి మార్కెట్ ఉన్నా కూడ అంత పెద్ద అందుకోలేదు. కానీ ఏషియన్ గ్రూప్ నిర్మాతలు తెలుగులో పవన్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి ఇచ్చేంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఈ సినిమాతో ధనుష్ కెరీర్ కొత్త మలుపు తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవిని తీసుకునే యోచనలో ఉన్నారట టీమ్. ప్రజెంట్ అమెరికాలో ఉన్న ధనుష్ ఇండియా రాగానే సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేస్తారు. అది పూరయ్యాక శేఖర్ కమ్ముల సినిమా ఉండవచ్చు.

సంబంధిత సమాచారం :