
ధనుష్, తాప్సి జంటగా నటించిన తమిళ సినిమా ‘ఆడు కాలం’. అక్కడ ఘనిజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో ‘పందెం కోళ్ళు’ పేరుతో సన్ పిక్చర్స్, సమూహ టాకీస్ సంయుక్తంగా అనువదిస్తున్నారు. ఎ.శేఖర్ బాబు, ఎం.కిషోర్ కుమార్ రెడ్డి నిర్మాతలు. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. బుధవారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్వీ ప్రసాద్, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
ఇటివల తెలుగులో ఘనవిజయం సాధించిన ‘రఘువరన్ బిటెక్’ తరహాలో ‘పందెం కోళ్ళు’ సినిమా కూడా ఘన విజయం సాధించాలని అతిధులు ఆకాంక్షించారు. జనవరి 30న సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.

