రజినీలా కాస్త ట్రై చేసా అంటున్న ధనుష్.!

Published on Jun 8, 2021 9:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి అల్లుడు అని కూడా అందరికీ తెలిసిందే.. అయితే రజినీ అల్లుడు అనే కాకుండా తన నటనతో, తన సినిమాల ఎంపికతో అపారమైన క్రేజ్ ను ధనుష్ సొంతం చేసుకున్నాడు. మరి ఇదిలా ఉండగా ధనుష్ నటించిన లేటెస్ట్ చిత్రం “జగమే తందిరం” చిత్రం నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ కు రెడీగా ఉంది.

ఇటీవల “కర్ణన్” తో భారీ రెస్పాన్స్ అందుకున్న ధనుష్ ఇప్పుడు ఈ చిత్రంతో మళ్ళీ ఓటిటి వీక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు. అయితే మరి ఈ చిత్రం ప్రమోషన్స్ ను కూడా వర్చువల్ గా ఓ రేంజ్ లో నిర్వహిస్తున్న ధనుష్ లేటెస్ట్ గా వచ్చిన ట్విట్టర్ స్పేస్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.

తాను అండర్ వరల్డ్ డాన్ గా చేస్తున్న ఈ చిత్రంతో కొన్ని చోట్ల తన మావయ్య సూపర్ స్టార్ రజినీ గారి మ్యానరిజంలు ట్రై చేసానని అవి తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయని ధనుష్ తెలిపాడు. దీనితో కోలీవుడ్ వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొంది. మరి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే జూన్ 18 న నెట్ ఫ్లిక్స్ లో తెలుగు మరియు తమిళ్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :