ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉందంటున్న ధనుష్

Published on Jun 8, 2021 3:00 am IST

విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకుంటున్న హీరో ధనుష్ నుండి వస్తున్న కొత్త చిత్రం ‘జగమే తంతిరం’. ఆయన గత రెండు చిత్రాలు ‘అసురన్, కర్ణన్’ మంచి విజయాలను సాధించడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను కార్తీక్ సుబ్బారాజ్ డైరెక్ట్ చేశారు. ఈ నెల18న నెట్ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా విడుదల సందర్భంగా ధనుష్ ట్విట్టర్లో స్పేస్ ద్వారా అందుబాటులోకి వచ్చారు.

ఆ సంభాషణలో భాగంగా పలు విషయాలను పంచుకున్నారు ఆయన. ఈ సినిమాలో చేసిన పాత్ర తనకు చాలా ఇష్టమైన పాత్రని, వీలుంటే సీక్వెల్ చేయాలని కోరికగా ఉందని, కార్తీక్ సుబ్బారాజ్ మంచి ఐడియా ఆలోచిస్తే అది కుదురుతుందని తన మనసులోని కోరిక తెలిపారు. కార్తీక్ సుబ్బారాజ్ సైతం సీక్వెల్ చేయడానికి రెడీ అన్నట్టే తెలిపారు. ఇకపోతే నెట్ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ఒకటి లేదా రెండు నెలల తరువాత ఈ చిత్రం టీవీల్లో ప్రసారం కానుంది. టీవీల్లో ప్రసారమయ్యే వెర్షన్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే వెర్షన్ కంటే రెండు పాటలను అదనంగా ఉంచుతున్నారు టీమ్.

సంబంధిత సమాచారం :