కమ్ములతో ప్రాజెక్ట్ పై బాగా ఎగ్జైట్ అవుతున్న ధనుష్.!

Published on Jun 19, 2021 11:03 am IST

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కూడా కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కు సెపరేట్ క్రేజ్ ఏర్పడుతుంది. అలాగే ఓ భాష దర్శకుడు లేదా హీరోలు ఇతర భాషల్లో కలిపి నటిస్తున్నారంటే అవి మరింత ప్రత్యేకంగా కూడా ఉంటాయి. మరి ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్ లలో ఒకటే శేఖర్ కమ్ముల మరియు వెర్సిటైల్ హీరో ధనుష్ కాంబోలో తెరకెక్కించనున్న చిత్రం కూడా ఒకటి.

నిన్ననే ఈ సినిమాపై అధికారిక క్లారిటీ కూడా రాగా ఇప్పుడు ధనుష్ కూడా తమ సినిమాపై స్పందించాడు. “నిజంగా శేఖర్ కమ్ముల గారితో సినిమా చెయ్యడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని అలాగే నిర్మాతలు నరాంగ్ నారాయణ దాస్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు గార్లతో కలిసి వర్క్ చేస్తుండడం కూడా సంతోషంగా ఉందని తెలిపి ఈ ట్రై లాంగువల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాని” ధనుష్ ఎగ్జైటింగ్ ట్వీట్ పెట్టాడు. మరి ఈ సాలిడ్ కాంబో నుంచి ఎలాంటి సినిమా వస్తుందో అని ధనుష్ తో పాటు ఆడియెన్స్ కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :