ముందు రోజే రానున్న ‘జగమే తంత్రం’ !

Published on Jun 17, 2021 9:10 pm IST

తమిళ హీరో ధనుష్ కొత్త సినిమా ‘జగమే తంత్రం’ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘పేట్టా’ చిత్రాన్ని తీసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి దర్శకుడు కావడంతో.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ మూవీ 190 దేశాల్లో 17 భాషల్లో ఏకకాలంలో రిలీజ్‌ చేసేలా నెట్‌ఫ్లిక్స్‌ అన్ని ఏర్పాట్లుచేసింది.

అయితే, ఓటీటీలో కొత్త సినిమాలు ముందు రోజు అర్థరాత్రి 12 గంటలకు నుంచి స్ట్రీమ్‌ అవుతుంటాయి. అయితే ‘జగమే తంత్రం’ ముందు రోజు అర్ధరాత్రి కాకుండా 18న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది. కథ విషయానికి వస్తే.. తమిళనాడు నుంచి లండన్ కి వెళ్లి అక్కడ మాఫియా నాయకుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథ అట ఇది, మాఫియా లీడర్ గా ధనుష్ పూర్తిగా కొత్త నటన చూపించబోతున్నాడు. ధనుష్ గెటప్ అండ్ లుక్స్ కూడా సినిమా పై ఆసక్తిని పెంచాయి.

సంబంధిత సమాచారం :