ధనుష్ చిత్రం.. 190 దేశాలు, 17 భాషలు

Published on Jun 15, 2021 7:02 pm IST

తమిళ హీరో ధనుష్ చేసిన కొత్త చిత్రం ‘జగమే తంతిరం’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా. చాలా రోజుల క్రితమే పూర్తైన ఈ చిత్రం లాక్ డౌన్ మూలంగా వాయిదాపడుతూ వచ్చింది. ఇప్పుడప్పుడే సినిమా హాళ్లు తెరుచుకునే వీలు లేకపోవడంతో నేరుగా ఓటీటీ ద్వారా విడుదలచేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ నెల 18న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. మొత్తం 190 దేశాల నెట్ ఫ్లిక్స్ వినియోగదారులకు ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

తమిళం, తెలుగు, మలయాళం. కన్నడ, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ ఇలా మొత్తం 17 భాషల్లో చిత్రం విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ధనుష్‌ ఇందులో సూరాలి అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇది పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రంగా ఉండనుంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వై నాట్‌ స్టుడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగులో ఈ చిత్రం ‘జగమే తంత్రం’ పేరుతో అందుబాటులోకి వస్తుంది.

సంబంధిత సమాచారం :