ఆకట్టుకుంటున్న ధనుష్ ‘తిరు’ ట్రైలర్ …!

Published on Aug 13, 2022 9:00 pm IST

వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా మిత్రన్ ఆర్ జవహర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా తిరు. కళానిధిమారన్ నిర్మాతగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ మూవీలో నిత్యా మీనన్, రాశి ఖన్నా, ప్రియా భవానీశంకర్ హీరోయిన్స్ గా నటించగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న ఈ మూవీ పై ధనుష్ ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలేస్ చేసింది యూనిట్. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే తిరు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఫుడ్ డెలివరీ బాయ్ గా ధనుష్, అతడి ఫ్రెండ్ గా నిత్యా, అలానే ఇతర పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, భారతి రాజా, మునీష్ కాంత్, హీరోయిన్స్ ప్రియా భవాని శంకర్, రాశి ఖన్నా వంటి వారిని ట్రైలర్ లో చూడవచ్చు. ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనింగ్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో రూపొందిన ఈ ట్రైలర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీని ఆగష్టు 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :