సమీక్ష : “ధీర” – యాక్షన్ బాగున్నా ఎమోషన్స్ ఆకట్టుకోవు

సమీక్ష : “ధీర” – యాక్షన్ బాగున్నా ఎమోషన్స్ ఆకట్టుకోవు

Published on Feb 3, 2024 3:05 AM IST
Captain Miller Movie Review in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: లక్ష్ చదలవాడ, సోనియా బన్సల్, నేహా పఠాన్, హిమజ, మిర్చి కిరణ్, సుమన్ తదితరులు

దర్శకుడు : విక్రాంత్ శ్రీనివాస్

నిర్మాత: పద్మావతి చదలవాడ

సంగీత దర్శకులు: సాయి కార్తీక్

సినిమాటోగ్రఫీ: కన్నా పిసి

ఎడిటింగ్: వినయ్ రామస్వామి వి

సంబంధిత లింక్స్: ట్రైలర్

డిఫరెంట్ జానర్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న యువ నటుడు లక్ష్ చదలవాడ తాజాగా ధీర మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. విక్రాంత్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.

కథ :

రణధీర్ (లక్ష్ చదలవాడ) వృత్తి రీత్యా డ్రైవర్. అయితే అతడు డబ్బు కోసం పరిస్థితులని ఆలోచించకుండా ఎటువంటి పని అయినా చేస్తూ ఉంటాడు. అయితే ఒక పేషెంట్ ని వైజాగ్ నుండి హైదరాబాద్ తీసుకువెళ్లాలని కొందరు డాక్టర్ల గ్రూపు రణధీర్ కు పనిని పురమాయిస్తారు. డాక్టర్ అమృత (నేహా పఠాన్) అతడికి ఆ విషయమై సహాయం చేస్తుంది. ఆ ప్రాసెస్ లో సదరు పేషంట్ కి ఎంతో ఇన్ ఫ్లుయెన్స్ ఉందని రణధీర్ గ్రహిస్తాడు. మరి ఇంతకీ ఎవరు ఆ పేషంట్, అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి, మరి రణధీర్ తనకు అప్పగించిన పనిని పూర్తి చేశాడా లేదా అనేవి మొత్తం కూడా సినిమాలో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధాన బలం హీరో లక్ష్ చదలవాడ అని చెప్పాలి. ముఖ్యంగా కామెడీ తో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా అతడు బాగా పెర్ఫార్మ్ చేసాడు. ప్రత్యేకంగా కొన్ని సీన్స్ లో అయితే అతడు మరింతగా ఆకట్టుకున్నాడు. ఇక మూవీ రొటీన్ కథ తో కూడినది అయినప్పటికీ కొన్ని సీన్స్, అలానే సెకండ్ హాఫ్ లో కొన్ని క్రూషియల్ సన్నివేశాలు బాగుంటాయి. సాయి కార్తీక్ అందించిన సాంగ్స్ ఆడియో పరంగానే కాక విజువల్ గా కూడా బాగున్నాయి. హీరోయిన్ నేహా పఠాన్ తన పాత్రలో ఆకట్టుకునే అందం అభినయంతో అలరించారు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఇక సీఎం కి పీఎస్ గా నటించిన హిమజ కూడా ఆకట్టుకున్నారు. షార్ప్ ఎడిటింగ్ వలన ధీర మూవీ పెద్దగా బోర్ కొట్టదు.

మైనస్ పాయింట్స్ :

సినిమా చాలా వరకు యాక్షన్ పార్ట్ తో సాగుతుంది, అలానే ఎమోషన్ తక్కువగా ఉంటుంది. ఎక్కువగా హీరోయిజం పై దృష్టిపెట్టిన దర్శకుడు ఎమోషనల్ డెప్త్ పై మాత్రం దృష్టి సారించలేదు. సోనియా భన్సాల్ సీన్స్ పెద్దగా అలరించవు. హీరో హీరోయిన్ మధ్య సాగే లవ్ ట్రాక్ తో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. అయితే ఆ పోర్షన్ లో పలు సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు.

సాంకేతిక వర్గం :

సాంగ్స్ తో పాటు సాయి కార్తీక్ అందించిన బీజీఎమ్ కూడా ఎంతో బాగుంది. కన్నా అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ విభాగం తీరు బాగానే పనిచేసినా డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. హీరో లక్ష్ ని దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్ బాగానే ప్రెజెంట్ చేసినప్పటికీ ఎమోషనల్ పార్ట్ పై మాత్రం దృష్టి పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బాగుంటుంది. స్టోరీ యొక్క మెయిన్ స్లాట్ సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది.

తీర్పు :

మొత్తంగా ధీర మూవీ హీరో లక్ష్ చదలవాడ వన్ మ్యాన్ షో గా సాగుతుంది. యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ ఏమాత్రం ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. రొటీన్ కథ అయినప్పటికీ సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ సాదాసీదాగా ఉంటాయి. ఇక యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు రాసుకుని ఉంటె తప్పకుండా మూవీ మంచి సక్సెస్ అయి ఉండేది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు