అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై !

అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై !

Published on Aug 15, 2020 9:34 PM IST

భారత క్రికెట్ చరిత్రలో కొందరి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి పేరే మహేంద్ర సింగ్ ధోనీ. సడెన్ గా అంతర్జాతీయ క్రికెట్ నుండి సెలవు తీసుకుని అందరికి షాక్ ఇచ్చాడు. ప్రపంచంలోనే బెస్ట్ కెప్టెన్ లలో ఒకడైన ధోని భారత్ కు టీ-20 ప్రపంచ కప్ ను, అలాగే వన్డే ప్రపంచ కప్ ను అందించాడు. ఈ రికార్డ్ ను సాధించిన ఏకైక సారథి కూడా ధోనినే కావడం ఆయన ఘనతకు నిదర్శనం.

ఇంతవరకూ ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా రెండు ప్రపంచ కప్ లతో కలిపి చాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిచింది లేదట. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ ధోనీ కావడం విశేషం. అలాగే ధోనీ నేతృత్వంలోని భారత జట్టు మొట్టమొదటిసారి టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానాన్ని కూడా అందుకోవడం మరో గొప్ప విజయం. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత ఇప్పటివరకు మైదానంలోకి దిగని ధోని ఒక్కసారిగా…. తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో తన వ్యక్తిత్వానికి తగ్గట్టు కూల్ గా తన రిటైర్మెంట్ ను ఒక వీడియో ద్వారా ప్రకటించేయడంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశకి గురైయ్యారు. ఒక్కటి మాత్రం నిజం యావత్తు క్రికెట్ అభిమానులంతా ధోని నిర్ణయాన్ని గౌరవించాలని కోరుకుందాం. అయితే ఐపీఎల్ మొదలయ్యే సమయంలో ధోనీ ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో అని చర్చ జరుగుతుంది. ఇక మరో క్రికెటర్ సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు తన రిటైర్మెంట్ ను ప్రకటించి ధోని లాగే షాక్ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు