సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా “అశ్వమేధం” టీజర్.

Published on Jun 21, 2019 12:25 pm IST

ధృవ్ కరుణాకర్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్నసస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ” అశ్వమేధం”. కొద్దిసేపటి క్రితం విడుదలైన అశ్వమేధం టీజర్ ఆసక్తికరంగా ఉంది. హీరో ధృవ్ తన జీవితంలో ఎదురవుతున్న హఠాత్ పరిణామాలు,సంఘటనలకు,హత్యలకు తానే కారణమంటూనే , తనని అలా నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏమిటో తనకు తెలియాలి,అందుకే ఈ అశ్వమేధం అనడం కొంచెం అయోమయానికి గురిచేస్తూనే, ప్రేక్షకుడిలో ఆతృతను కలిగిస్తుంది.

ధృవ్ సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ హీరోగా అలరిస్తాడనిపిస్తుంది. ప్రియదర్శి,వెన్నెల కిశోర్,సుమన్, సోనియా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీకి నితిన్ జి దర్సకత్వం వహిస్తుండగా, ప్రియా నైర్ నిర్మిస్తున్నారు.సంగీతం చరణ్ అర్జున్ అందిస్తున్నారు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.

టీజర్ కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More