ఇటీవల వరదలతో తీవ్రంగా నష్ట పోయిన దక్షిణాది రాష్ట్రం కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. దాదాపు నెల రోజులు కురిసిన వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఇక ఆ రాష్ట్ర ప్రజల కోసం అనేక మంది పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటించారు. దాంట్లో ముఖ్యంగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమ నుండి ఎక్కువ మొత్తంలో విరాళాలు అందాయి.
ఇక తాజాగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కేరళకు తన వంతు సాయం చేశాడు. ఆయన నటిస్తున్న మొదటి చిత్రం ‘వర్మ’ కు తీసుకున్న పారితోషికాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ను కలిసి చెక్ రూపంలో కేరళ వరద బాధితుల సహాయార్థం ఆయనకు అందజేశాడు.
ఇక ధృవ్ నటిస్తున్న ‘వర్మ’ చిత్రం తెలుగు సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ప్రముఖ దర్శకుడు బాల తెరకెక్కిస్తున్న ఈచిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.


