షూటింగ్ పూర్తి చేసుకున్న అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ !

షూటింగ్ పూర్తి చేసుకున్న అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ !

Published on Sep 17, 2018 10:13 PM IST

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ , హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ రీమేక్ లో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరో గా నటిస్తున్నాడు. ‘వర్మ’ అనే టైటిల్ తో వస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈరోజుతో పూర్తి అయింది. వచ్చే శనివారం తమిళనాడులోని ఓ ఫేమస్ కళాశాలలో ఈచిత్రం యొక్క ఆడియో వేడుక ఘనంగా జరుగనుంది.

ఈచిత్రంలో ధృవ్ విక్రమ్ కు జోడిగా బెంగాలీ భామ మేఘ చౌదరి నటిస్తుంది. వీరిద్దరు ఈచిత్రంతోనే తమిళ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ4 ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రధాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు