‘ధురంధర్ 2’ లేటెస్ట్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా..?

‘ధురంధర్ 2’ లేటెస్ట్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా..?

Published on Mar 27, 2026 4:05 PM IST

Dhurandhar-2

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారతదేశంలో ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.690 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇందులో హిందీ వెర్షన్ నుండే రూ. 650 కోట్లు రాగా, ఇతర భాషల ద్వారా మరో రూ. 40 కోట్లు వసూలయ్యాయి.

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సంచలనం రేపుతోంది. గల్ఫ్ దేశాల్లో విడుదల కాకపోయినప్పటికీ, విదేశాల్లో రూ.274 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నేటి వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1100 కోట్ల మార్కును దాటేసింది. అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన ఇండియన్ చిత్రంగా ‘ధురంధర్ 2’ నిలిచింది.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్ తదితరులు నటించారు. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

ధురంధర్

తాజా వార్తలు