ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం పుష్ప 2 నార్త్ బెల్ట్ లో ఏ రేంజ్ లో సంచలనం సెట్ చేసిందో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. పుష్ప 2 అందుకున్న 1800 కోట్ల వసూళ్ళలో హిందీలో నుంచే ఏకంగా 1000 కోట్లకి పైగా రావడం విశేషం. అంటే హిందీ మార్కెట్ లో పుష్ప 2 నమోదు చేసిన రికార్డుల తాండవం ఏ స్థాయిలో అనేది అర్ధం చేసుకోవచ్చు. కానీ దీనిని ఇప్పుడు బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar) బ్రేక్ చేస్తూ కొత్త సంచలనాలకు దారి తీస్తుంది.
Dhurandhar breaks Pushpa 2 Records – వరుసగా రెండో రోజు పుష్ప 2 రికార్డు వసూళ్లు బ్రేక్..
ధురంధర్(Dhurandhar) సినిమా హిందీ వెర్షన్ లో మొన్న శుక్రవారం నుంచి హైయెస్ట్ సింగిల్ డే వసూళ్లు రికార్డు గా ఉన్న పుష్ప 2 చిత్రం 27 కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబడితే ధురంధర్ దాన్ని 34 కోట్లతో బ్రేక్ చేసి సెన్సేషన్ ని సెట్ చేసింది. ఇక శనివారం కూడా మళ్ళీ పుష్ప 2 హైయెస్ట్ నెంబర్ ని ఈ సినిమా బద్దలు కొట్టింది. పుష్ప 2 సినిమాకి గాను 46 కోట్లకి పైగా నెట్ వసూళ్లు వస్తే ధురంధర్ దీనిని బ్రేక్ చేసి ఏకంగా 53.7 కోట్లు రాబట్టి దుమ్ము లేపింది. ఇలా ఎవరూ బ్రేక్ చేయలేరు అనుకున్న పుష్ప 2 రికార్డ్స్ కూడా ఇప్పుడు హిందీ మార్కెట్ లో బ్రేక్ అవుతున్నాయి.
ధురంధర్ 300 కోట్లు నాటౌట్..<.h4>
ఇక హిందీ సినిమా నుంచి ధురంధర్ మరో ఫాస్టెస్ట్ రికార్డు కూడా సెట్ చేసింది. 300 కోట్ల క్లబ్ లో కేవలం 9 రోజుల్లోనే ఈ సినిమా జాయిన్ అయ్యి ఈ ఏడాదిలో మూడో సినిమాగా నిలిచినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
సో ధురంధర్ సంచలనం ఈ రేంజ్ లో కొనసాగుతుంది. ఇక ఈ ఆదివారం కూడా మరో ఊహించని నెంబర్ ని ఈ సినిమా సెట్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.


