ప్రతీ దర్శకునికి కూడా ఒక డ్రీం ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఫలానా జానర్ లో ఫలానా హీరోతో లేదా హీరోయిన్ తో చేయాలని సినిమా పరంగా ప్రతీ ఒక్క దర్శకుడు ఒక డ్రీం ప్రాజెక్ట్ ని చేసేందుకు చాలా శ్రమిస్తారు. అలానే ఇప్పుడు ఇండియన్ సినిమా షేక్ చేస్తున్న “ధురంధర్” చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ డ్రీం ప్రాజెక్ట్ కోసం మళ్ళీ చర్చలోకి వచ్చింది.
అయితే ధురంధర్ దర్శకుడు కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ఈ సినిమాతోనే మాట్లాడుకుంటున్నారు. ఇది ఒకింత తనకి ప్లస్ అనే చెప్పాలి. ఆదిత్య ధర్ తన డ్రీం ప్రాజెక్ట్ గా “అశ్వత్థామ” అనే భారీ సైన్స్ ఫిక్షన్ ఇంకా మైథలాజి టచ్ ఉన్న సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా పలు కారణాల చేత పట్టాలెక్కలేదు. బడ్జెట్ ఇంకా తనకి సరైన టెక్నికల్ సపోర్ట్ దొరక్కపోవడంతో ధురంధర్ మధ్యలోకి వచ్చింది.
అయితే ఇప్పుడు ధురంధర్ తో తన సత్తా చాటడంతో ఆగిపోయింది అనుకున్న తన డ్రీం ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్ తెలుస్తుంది. తాను అశ్వత్థామ సినిమాని ఆపలేదని దానిని గ్రాండ్ లెవెల్లో తీయాలని చూస్తున్నాను అని అందుకు తగ్గ బడ్జెట్ ఇంకా టెక్నాలజీ సేకరించే పనిలోనే ఉన్నట్టు తాను తెలిపారట. సో ధురంధర్ తో విధ్వంసం చూపించిన ఈ దర్శకుడు సై ఫై జానర్ లో ఎలాంటి ఫీస్ట్ అందిస్తారో చూడాలి.


