సింగిల్ హ్యాండెడ్ గా పార్ట్ 1 కే వెయ్యి కోట్లు.. ఇండియన్ సినిమా దగ్గర ఇదే మొదటిది?

1000 crore

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచి ఒక్క భాషలోనే రికార్డు వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం “ధురంధర్” (Dhurandhar) హిస్టారికల్ రన్ కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. కేవలం ఒకే ఒక్క భాషలో వచ్చి విధ్వంసం చేసి పారేసింది ఈ చిత్రం. ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్స్ లోకి కేవలం హిందీలో మాత్రమే విడుదల అయ్యి చాలా మినిమమ్ ఓపెనింగ్స్ మాత్రమే అందుకుంది.

కానీ దర్శకుడు ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ ఇంకా అక్షయే ఖన్నాలు సాలిడ్ పెర్ఫామెన్స్ లతో ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. స్ట్రాంగ్ మౌత్ టాక్ తో ఈ ఏడాదికి ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ గ్రాసర్ గా మాత్రమే కాకుండా ఏకంగా వరల్డ్ వైడ్ 1000 కోట్ల గ్రాస్ ని అందుకున్న మరో భారతీయ సినిమాగా నిలిచింది.

Dhurandhar hits 1000 crore – ఇది ఫస్ట్ ఎవర్ 1000 కోట్ల సినిమా.. ఎలా అంటే

ధురంధర్ (Dhurandhar) కి ముందే చాలానే సినిమాలు ఇండియన్ సినిమా మార్కెట్ దగ్గర 1000 కోట్లు 1500 కోట్లకు పైగా కూడా క్రాస్ చేసాయి. కానీ ధురంధర్ సెట్ చేసిన రికార్డు మాత్రం ఏ ఇండస్ట్రీలోని ఏ హీరో ఖాతాలో కూడా లేదు. దీనికి ముందు 1000 కోట్లు క్రాస్ చేసిన ప్రతీ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది. కానీ ఒక్క ధురంధర్ మాత్రమే కేవలం ఒక్క భాషలో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మార్క్ ని అందుకుంది.

రెండో హైయెస్ట్ గ్రాసర్ సల్మాన్ కి సొంతం..

కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు కాదు ఏకంగా ఓ దశాబ్ద కాలం కితమే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 900 కోట్లకి పైగా గ్రాస్ ని “భజరంగి భాయిజాన్”తో కొట్టారు. దానిని ఇప్పుడు ధురంధర్ బ్రేక్ చేసింది.

ఈ బిగ్గెస్ట్ రికార్డు కూడా ధురంధర్ కే సొంతం

ఇండియన్ సినిమా దగ్గర జెనరల్ గా ఏ సర్టిఫైడ్ సినిమాలకి భారీ వసూళ్లు లేవు. ఉన్నా కూడా అవి తక్కువే కనిపిస్తాయి. అయితే దీనికి ముందు వచ్చిన అనిమల్ (Animal Movie) సినిమా 1000 కోట్లు టచ్ చేస్తుంది అని అనుకున్నారు కానీ కుదరలేదు. కానీ దీనిని కూడా ధురంధర్ సినిమా టచ్ చేసి మొదటి 1000 కోట్ల గ్రాస్ అందుకున్న ఏ సర్టిఫైడ్ సినిమాగా నిలిచింది.

మరి ఇదంతా కేవలం పార్ట్ 1 వరకు మాత్రమే అయితే మేకర్స్ పార్ట్ 2 ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అనౌన్స్ చేశారు. సో దీనికే ఈ రేంజ్ లో ఉంటే ఇక పార్ట్ 2 కానీ క్లిక్ అయితే మాత్రం దాని మేనియా వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు.

Exit mobile version