షూట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘బాలయ్య’ ?

షూట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘బాలయ్య’ ?

Published on Sep 13, 2026 8:00 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. ఐతే, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అక్టోబర్ రెండో వారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ముందుగా తీయనున్న యాక్షన్ సీన్స్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో బాలయ్య పైనే షూట్ చేస్తారట. ప్రస్తుతం గాయం కారణంగా బాలయ్య రెస్ట్ తీసుకుంటున్నారు. ఐతే, అక్టోబర్ మొదటి వారం నుంచి బాలయ్య మళ్లీ షూట్స్ తో బిజీ కానున్నాడు.

అన్నట్టు ఈ షెడ్యూల్ ను సుమారు 15 రోజులకు పైగా షూట్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు