గమనించారా? “RRR” లో ఎన్టీఆర్ పై ఈ చిన్న బిట్..మినీ విస్ఫోటనంలా ఉంటుంది.!

Published on Jun 12, 2022 1:00 pm IST

ఈ ఏడాదికి మన ఇండియన్ సినిమా నుంచి వసూళ్ల పరంగా పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయి రీచ్ ను అందుకున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” అని చెప్పాలి.

దర్శకుడు రాజమౌళి విజన్ మరియు బ్రిలియెన్స్ లు ఏ రేంజ్ లో ఉంటాయో ఈ చిత్రం చెప్పింది. దీనితో ఇప్పుడు మరోసారి ప్రపంచ ఆడియెన్స్ ఈ సినిమాకి దాసోహం అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఒక్క చిన్న బిట్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. అది కూడా ఎన్టీఆర్ పై తనలోని నటుడిని సింపుల్ గా ఒక అగ్ని పర్వతం పేలినట్టు అనిపిస్తుంది.

అయితే ఈ సీన్ ఎక్కడ ఉంటుంది అంటే రామరాజుని భీమ్ పాత్ర కాపాడి ఇంటికి తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెడుతుంది. అక్కడ భీమ్ వెళ్లిపోయే ముందు తన నిజ రూపాన్ని రామరాజుకి వెల్లడిస్తాడు. అయితే ఈ సీన్ ని కాస్త జాగ్రత్తగా చూస్తే తాను అప్పటి వరకు అక్తర్ అనే ముసుగు(పరదా) కప్పుకొని ఉంటాడు దానికి అనుగుణంగా ఎన్టీఆర్ ని ఆ మంచంపై అక్తర్ గా మాట్లాడుతున్నంత సేపు ఒక పరదా వెనుక నుంచి రాజమౌళి చూపిస్తాడు.

కానీ ఒక్క సెకండ్ లో ఎన్టీఆర్ “అన్నా” అంటూ డైలాగ్ స్టార్ట్ చేస్తూ షేడ్ మార్చేసరికి అక్కడ అక్తర్ అనే ముసుగు తొలగుతుంది భీమ్ అనే పాత్ర కెమెరా యాంగిల్ తో రివీల్ అవుతుంది. జస్ట్ ఈ చిన్న సీక్వెన్స్ లో అక్తర్ నుంచి భీమ్ గా ఎన్టీఆర్ తన భాష నడవడిక సునాయాసంగా మారుస్తాడు. ఇది మాత్రం కంప్లీట్ గా రాజమౌళి మరియు ఎన్టీఆర్ ల మాస్ బ్రిలియెన్స్ అని చెప్పాల్సిందే. ఒకసారి డౌట్ ఉంటే ఈ పర్టిక్యులర్ సీన్ ని ఓటిటి లో చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది.

సంబంధిత సమాచారం :