సుమంత్ సినిమాకి డిఫరెంట్ టైటిల్ ?

కొన్నాళ్లుగా సరైన సినిమాలు లేక ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిన హీరో సుమంత్ ఇటీవలే ‘మళ్ళీ రావా’ లాంటి భిన్నమైన సబ్జెక్ట్ చేసి అందరి మెప్పూ పొందారు. ఈ విజయం అందించిన కొత్త ఉత్సాహంతో ఆయన తన తర్వాతి సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకునం ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తున్నారు.

సుమంత్ కొంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘ఇదం జగత్’ అనే డిఫరెంట్ టైటిల్ ను ఖాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్లో ఉండబోయే ఈ సినిమాతో మలయాళీ నటి అంజు కురియన్ హీరోయిన్ గా పరిచయంకానుంది.