‘వకీల్ సాబ్’ బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యేనా ?

‘వకీల్ సాబ్’ బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యేనా ?

Published on Apr 21, 2021 12:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం ఆరంభం నుండి ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉంది. స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వకపోవడం, టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించకపోవడంతో సినిమా ఓపెనింగ్స్ మీద ప్రభావం పడింది. మూడు ఏఓజుల్లో చిత్రం రూ.53.5 కోట్ల షేర్ వసూలు చేసింది. అన్ని సినిమాలకు ఉన్నట్టే ఈ సినిమాకు కూడ వెసులుబాట్లు ఉండి ఉంటే ఇంకా మెరుగైన వసూళ్లే వచ్చి ఉండేవి. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ సినిమాను లాకొచ్చింది. మహిళా ప్రేక్షకుల ఆదరణ కూడ దొరకడంతో చిత్రం మొదటి వారానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.71 కోట్ల వరకు వెనక్కు రాబట్టింది.

ఇక తగ్గిన టికెట్ ధరల మూలంగా రెండవ వారం వసూళ్లు కొంత క్షీణించాయి. 10 రోజులకుగాను చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.76 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.83 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఈరోజు నుండి ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమలులోకి వచ్చింది. ఇది ‘వకీల్ సాబ్’ వసూళ్లను ఇంకాస్త క్షీణించేలా చేయడం ఖాయం. అదే తెలంగాణలో కూడ అదే 50 శాతం ఆక్యుపెన్సీ అంటే ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.90 కోట్ల పైమాటే. మరి ఇన్ని ఇబ్బందులను అధిగమించి పవన్ ఆ బ్రేక్ ఈవెన్ మార్క్ తాకి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల బాట పట్టిస్తారా లేదో సెకండ్ వీక్ పూర్తైతే తేలిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు