ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేయడం కష్టం – కాజల్ అగర్వాల్

ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేయడం కష్టం – కాజల్ అగర్వాల్

Published on Feb 12, 2015 12:44 PM IST

kajal-agarwal

ఎన్టీఆర్ ఈజ్ గ్రేట్ డాన్సర్. అతనితో స్టెప్స్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఎంత కష్టరమైన స్టెప్ అయినా ఒక్కసారి చూస్తే చాలు, రెండు మూడు నిముషాలలో చేసేస్తాడు. అతని స్పీడ్ అందుకోవడానికి నాకు టైం పట్టేది. ‘టెంపర్’ సినిమాలో అతని పక్కన డాన్స్ చేయడానికి కష్టపడ్డాను. ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం ఈజీ కాదు. అని అంటుంది కాజల్ అగర్వాల్. ‘బృందావనం’, ‘బాద్ షా’ సినిమాల తర్వాత ఎన్టీఆర్ తో హట్రిక్ హిట్ కొట్టడానికి కాజల్ ఎదురుచూస్తుంది.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ సినిమాకు పెద్ద హైలైట్ అని సమాచారం. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఈ సినిమాపై అభిమానులలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

తాజా వార్తలు