కథ డిమాండ్ మేరకే అలాంటి సన్నివేశాలలో నటించా అంటున్న హీరోయిన్ .

Published on Jun 8, 2019 9:18 am IST

బుల్లి తెర నటిగా కెరీర్ ప్రారంభించి, హిందీ బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటి దిగాంగనా సూర్యవంశీ. బాలీవుడ్ లో ఫ్రైడే,జిలేబీ చిత్రాలలో నటించిన దిగాంగానా తెలుగు ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ మూవీ “హిప్పీ” మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. రంజాన్ సందర్బంగా ఈ నెల6 న విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన దక్కించుకొంది. ఈ సంధర్బంగా హీరోయిన్ దిగాంగనా ను మూవీలో కొంచెం బోల్డ్ సన్నివేశాలలో నటించారు అని అడుగగా, కథ డిమాండ్ చేయడం వలనే అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది అన్నారు.

అలాగే హిప్పీ లో ఆముక్తమాల్యద పాత్ర తనకు బాగా నచ్చిందని, నటనకు చాలా అవకాశం ఉన్న పాత్ర దొరికినందుకు ఆనందంగా ఉంది అన్నారు. మహేష్,అల్లు అర్జున సినిమాలు టీవీ లో చూస్తాను అని చెప్పిన ఈ అమ్మడికి రాజమౌళి అంటే చాలా ఇష్టం అంట. ఆయన తీసిన బాహుబలి మూవీ ని ఆరుసార్లు చూసిందట. సల్మాన్ ఆమెకు బాగా తెలిసినా ఆఫర్స్ కొరకు ఆయన సిపారసు తీసుకోను అని ఇలా అనేక విషయాలు చెప్పుకొచ్చారు.
హిప్పీ లో మరో హీరోయిన్ గా జజ్బా నటించగా, సీనియర్ హీరో జెడి చక్రవర్తి కీలకపాత్ర చేశారు

సంబంధిత సమాచారం :

More