రేపు ప్రారంభం కానున్న సునీల్ – దిల్ రాజు మూవీ

రేపు ప్రారంభం కానున్న సునీల్ – దిల్ రాజు మూవీ

Published on Aug 19, 2014 2:27 PM IST

Dil-Raju_Sunil

కమెడియన్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన సునీల్ హీరోగా మారిన తర్వాత మొదట్లో మంచి హిట్ సినిమాలు చేసాడు. కానీ కొద్ది రోజులుగా సరైన హిట్ లేక డీలా పడిపోయిన సునీల్ ప్రస్తుతం ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నాడు. ఇటీవలే ‘జోష్’ సినిమా డైరెక్టర్ వాసు వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని తెలిపాము. ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రేపు లాంఛనంగా ప్రారంభం కానుంది. అలాగే ఈ నెలాఖరులోగా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. సునీల్ స్టైల్లోనే పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. మిగిలిన వివారాలు రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సునీల్ తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా మారుతి, గోపి మోహన్ లతో కూడా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు