S/O సత్యమూర్తి నైజాం రైట్స్.. దిల్‌రాజు సొంతం!

S/O సత్యమూర్తి నైజాం రైట్స్.. దిల్‌రాజు సొంతం!

Published on Mar 16, 2015 10:53 AM IST

Dil-Raju-and-Satyamurthy
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్‌ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ఇప్పటికే ప్రచార చిత్రాల ద్వారా, టీజర్ ద్వారా ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేసింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమా నైజాం హక్కులను 13కోట్లకు పైనే చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ల గత చిత్రాల ట్రాక్ రికార్డ్ వల్ల కూడా సినిమా ఇంతగా ప్రీ బిజినెస్ చేస్తోందని పరిశ్రమ వర్గాల టాక్.

ఇక నిన్న (ఆదివారం) విడుదలైన ఆడియోకి కూడా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ట్రైలర్‌లో అల్లు అర్జున్ స్టైల్, త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులైతే ఈ కాంబినేషన్ మరొక హిట్ కొట్టినట్టే అని సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న కానీ, అల్లు అర్జున్ పుట్టిన రోజైన 8న కానీ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సరసన సమంతా, అదా శర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

తాజా వార్తలు