అనుష్కతో దిల్ రాజు క్రేజీ ప్రాజెక్ట్

అనుష్కతో దిల్ రాజు క్రేజీ ప్రాజెక్ట్

Published on Nov 2, 2015 10:10 PM IST

dill-raju-anushka
తెలుగు చలన చిత్ర సీమలో విజయశాంతి తర్వాత స్టార్ హీరోలకి ఈక్వల్ గా స్టార్డం తెచ్చుకోవడమే కాకుండా ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న ఏకైక హీరోయిన్ యోగ బ్యూటీ అనుష్క అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఈ ఏడాది బాహుబలి, రుద్రమదేవి అనే సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ త్వరలోనే ‘సైజ్ జీరో’ అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రానుంది. ఈ సైజ్ జీరో ఆడియో లాంచ్ నిన్న హైదరాబాద్ లో ఇండస్ట్రీలోని ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ వేడుకకి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు దిల్ రాజు అనుష్కతో చేయాలి అనుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇచ్చారు. ‘అనుష్క చాలా టాలెంట్ ఉన్న యాక్టర్.. అందుకే అందరు దర్శకులు తమ సినిమాలకు అనుష్కే కావాలని ఎంచుకుంటారు. నేను దిల్ రాజు గారు ఓ కథ గురించి 5 ఏళ్ళ క్రితం డిస్కస్ చేసాం. ఆ కథని ఇప్పుడు దిల్ రాజు సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. అంతే కాకుండా ఆ సినిమాకి అనుష్క అయితేనే బాగుంటుందని, పూర్తి కథతో తనని అప్రోచ్ అయ్యే పనిలో ఉన్నాడని’ శ్యాం ప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. అంతకన్నా ఆయన ప్రాజెక్ట్ గురించి చెప్పకపోయినా దిల్ రాజు -అనుష్క కాంబినేషన్ అనగానే ఫిల్మ్ వర్గాల్లో ఈ సినిమాపై ఆసక్తి బాగా పెరిగింది. మరి సినిమా కథ, దర్శకుడు ఎవరు అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

తాజా వార్తలు