“ఎఫ్ 3” కి టికెట్ రేట్స్ ఇందుకే తగ్గించాం – నిర్మాత దిల్ రాజు

“ఎఫ్ 3” కి టికెట్ రేట్స్ ఇందుకే తగ్గించాం – నిర్మాత దిల్ రాజు

Published on May 19, 2022 5:05 PM IST

ఈ ఏడాదికి ఆల్రెడీ రిలీజ్ కాక ముందే మంచి హైప్ ఇస్తూ హిట్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్న మరో సినిమా “ఎఫ్ 3”. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన హిట్ చిత్రం “ఎఫ్ 2” కి సీక్వెల్ గా చేసిన చిత్రమే “ఎఫ్ 3′. ఈ సినిమాకి అయితే మొదటి సినిమా కన్నా కూడా ఈ సినిమా ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.

దీనితో ఈ సినిమాపై మంచి హైప్ మరియు ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకోవడం గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఇంత మంచి హైప్ లో ఉన్నా కూడా దిల్ రాజు ఒక నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. ఈ సినిమాకి ఎలాంటి టికెట్ ధరల హైక్ లు ఉండవని తెలుగు రాష్ట్రాల్లో సాధారణ టికెట్ ధరలతోనే ఉంటుంది అని తెలిపారు.

అయితే లేటెస్ట్ ఇంటర్వూ లో దిల్ రాజు తాను ఎందుకు అలా చేసారో క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ టైమ్స్ లో జరిగిన సంఘటనల నిమిత్తం టికెట్ రేట్స్ పెంచడం జరిగింది అని ఆ తర్వాత RRR అలాగే కేజీయఫ్ 2 లాంటి సినిమాలు బాగా పెర్ఫార్మ్ చేశాయని కానీ చాలా వరకు సినిమాల్లో ఈ టికెట్ ధరల వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ రావడం లేదు.

కానీ మాది మళ్ళీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీనికి వారిని మిస్ చేసుకోడం ఇష్టం లేక వారిని రప్పించే విధంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే ఎఫ్ 4 సినిమాపై కూడా మాట్లాడుతూ ఆల్రెడీ దానిపై కూడా అనిల్ కి ఒక ఐడియా ఉంది కాకపోతే దాని కోసం ఇప్పుడే చెప్పడం త్వర పడినట్టు ఉంటుంది అందుకే ఈ సినిమా హిట్ అయ్యాక తెలియజేస్తాం అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు