“RRR” నటునితో దిల్ రాజు ఇంటెన్స్ సినిమా రీమేక్.!

Published on Jun 25, 2021 11:00 am IST

ఈ ఏడాది మన తెలుగు సినిమా దగ్గర విడుదల కాబడిన చిత్రాల్లో అల్లరి నరేష్ హీరోగా నటించిన ఇంటెన్స్ కోర్ట్ డ్రామా “నాంది” కూడా ఒకటి. విడుదలకు ముందే ఈ సినిమా కాన్సెప్ట్ సహా నరేష్ పెర్ఫామెన్స్ తోనే సూపర్ హైప్ తెచ్చుకొని తర్వాత హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే రీమేక్ కోసమే ఆఫర్స్ వచ్చాయని తెలిపారు. మరి ఎట్టకేలకు ఈ చిత్రం హిందీ రీమేక్ కు మొత్తం సిద్ధం అయ్యింది.

బాలీవుడ్ స్టార్ హీరో మరియు రాజమౌళి తెరకెక్కిస్తున్న “RRR” నటుడు అజయ్ దేవగన్ తో మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్న సంగతి కన్ఫర్మ్ అయ్యింది. మరి అలాగే ఈ ఆసక్తికర చిత్రం రీమేక్ ను దర్శకత్వం సహా ఇతర క్యాస్ట్ ను మరియు టెక్నీకల్ టీం వివరాలను వెల్లడి చెయ్యనున్నారు. మరి ఈ చిత్రం అక్కడ ఎంత పెద్ద హిట్ గా నిలుస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :