గుహన్ దర్శకత్వంలో మరొకసారి కళ్యాణ్ రామ్!

Published on Jul 5, 2021 12:00 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా వరుస సినిమాకు ప్రకటిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు కళ్యాణ్ రామ్ తో సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి కేవి గుహాన్ దర్శకత్వం వహించనున్నారు. కళ్యాణ్ రామ్ తో కలిసి దర్శకుడు గుహన్ గతం లో 118 సినిమా ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలో కళ్యాణ్ రామ్ తో #NKR20 తో సినిమా ను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యారు. క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అంటూ ఉన్న పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.

అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు మరియు శిరీష్ లు కలిసి సంయుక్తంగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే బింబిసర, #NKR19, #NKR21 లు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :